![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -981 లో.. శైలేంద్ర ఎలాగైనా యూత్ ఫెస్ట్ ని సక్సెస్ కానివ్వనంటు వసుధారతో అనగానే ఆ విషయం వెళ్లి అనుపమ, మహేంద్రలకి వసుధార చెప్తుంది. ఇన్నిరోజులు వాడు ఎలాంటి వాడో రిషికి చెప్పి ఉండాలిసింది.. జగతి బతికి ఉండేది.. రిషికి ఈ సిచువేషన్ వచ్చేది కాదని అనుపమ అంటుంది. ఎప్పటికప్పుడు వాడి నిజస్వరూపం బయట పెట్టాలని చూసాం కానీ ఏదో ఒక అడ్డు వచ్చేదని మహేంద్ర అంటాడు. వాడికి సరైన బుద్ది చెప్తాను. ఇప్పుడు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని వసుధార అంటుంది.
ఆ తర్వాత కాలేజీలో ఇంత పెద్ద ఫెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు వసుధార ఒక్కతే ఎంత ఇబ్బంది పడుతుందోనని దేవయాని, శైలేంద్రలతో ఫణీంద్ర అంటాడు. ఎండీ అని తనకి ఇంత పెద్ద బాధ్యత అప్పజెప్పారు కానీ ఈ బాధ్యత వేరే ఎవరికీ అయిన అప్పజెప్పితే బాగుండేదని దేవయాని అనగానే.. ఎవరికీ ఇవ్వాలి నీ కొడుకికా అని ఫణీంద్ర అంటాడు. అవును నా కొడుకుకే వాడికేం తక్కువ అని దేవయాని అనగానే.. ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తావ్? అసలు వాడికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యడమే రాదు.. మొన్న కాలేజీ లో అందరు రిషి చనిపోయాడంటు స్టూడెంట్స్ గొడవకు దిగితే కాలేజీ మూసేద్దామని అన్నాడు. అదే వసుధార ప్రాబ్లమ్ ని నిమిషాల్లో సాల్వ్ చేసిందని అంటాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా.. వాడి ట్యాలెంట్ చూపించేదని దేవయాని అంటుంది. ఆ తర్వాత ఆలోచించిన ఫణీంద్ర.. నీకేమైనా అలాంటి ఆశ ఉందా అని శైలేంద్రని అడుగుతాడు. అలాంటిదేం లేదని శైలేంద్ర అంటాడు. బోర్డు మెంబర్స్ కొంతమంది ఎండీగా వసుధారా అర్హురాలని అంటున్నారు. కొంతమంది కాదని అంటున్నారు. ఈ ఫెస్ట్ సక్సెస్ అయి వసుధారకి మంచి పేరు రావాలని ఫణింద్ర అంటాడు.
ఆ తర్వాత మరుసటి రోజు జరగబోయే ఫెస్ట్ కి సంబంధించిన షెడ్యూల్ వసుధార రాత్రంతా మేల్కొని ప్రిపేర్ చేస్తుంటే.. అనుపమ వచ్చి ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాను చూడండి అని అనుపమకి చూపిస్తుంది. అసి చూసిన అనుపమ బాగుందని మెచ్చుకుంటుంది. ఫెస్ట్ ఎలాగైనా చెడగొట్టి.. వసుధార ఎండీగా పనికి రాదని అందరిచేత చెప్పించాలని శైలెంద్ర అనుకుంటాడు. అప్పుడే ధరణి వచ్చి తన మాటలతో చిరాకు తెప్పిస్తుంది. ఫెస్ట్ ఫెయిల్ చెయ్యాలని మీరు ఆలోచిస్తున్నారంటు శైలెంద్రకి కోపం తెప్పిస్తుంది. మరుసటిరోజు ఉదయం వసుధార రెడీ అయి.. మీరు, అనుపమ రండి.. నేను వెళ్తానని మహేంద్రకి వసుధార చెప్పి.. జగతి ఫోటో దగ్గరికి వెళ్లి మొక్కుతుంది. మొదటిసారి ఇంత పెద్ద ఈవెంట్ చేయబోతున్నాను. బాగా జరగాలని మొక్కుకున్నానని మహేంద్రకి వసుధార చెప్తుండగా.. జగతి ఫోటో కిందకి పడిపోతుంది. దాంతో వసుధార, మహేంద్ర షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |